ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి జిల్లా ఎస్పీ తుహెన్ సిన్హా ఐపీఎస్

 *అనకాపల్లి జిల్లా పోలీసు* 

*పత్రికా ప్రకటన* 


*రోడ్డు ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు* 


*ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన ఎక్కువమంది దురదృష్టవశాత్తు మరణిస్తున్నారు: జిల్లా ఎస్పీ* 


*2024 సం., అనకాపల్లి జిల్లా లో ద్విచక్ర వాహన ప్రమాదాల కేసులు 103 నమోదు అవ్వగా, 104 మంది మృతి చెందారు. 35 మంది క్షతగాత్రులు అయ్యారు: జిల్లా ఎస్పీ* 


*అనకాపల్లి, నవంబర్ 29:* అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించే లా పటిష్టంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన ఎక్కువమంది దురదృష్టవశాత్తు మరణిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.


2024 సం., అనకాపల్లి జిల్లా లో ద్విచక్ర వాహన ప్రమాదాల కేసులు 103 నమోదు అవ్వగా, 104 మంది మృతి చెందారు. 35 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు.


ద్విచక్ర వాహనదారులు మొదటిసారి పట్టుబడితే జరిమానా, రెండోసారి పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిన, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్లో ప్రయాణించిన, హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టకపోయినా, ఐ.ఎస్.ఐ మార్క్ (నాణ్యమైన) హెల్మెట్ వాడకపోయినా, పిలియన్ రైడర్ (వెనక కూర్చున్న వ్యక్తి) తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేనియెడల అటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ చలాన్లు మూడు కంటే ఎక్కువ కట్టకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి జరిమానా కట్టిన తర్వాతే వాహనాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.


ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలలో రోడ్డు భద్రతా నియమాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామని, ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని జిల్లా ఎస్పీ కోరారు. 


*జిల్లా పోలీస్ కార్యాలయం,* *అనకాపల్లి.*