కౌశల్ జిల్లాస్థాయి పోటీలకు జోగంపేట హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

 *కౌశల్ జిల్లా స్థాయి పోటీలకు జోగంపేట హైస్కూల్ విద్యార్థులు ఎంపిక*


గొలుగొండ. కౌశల్ సైన్స్ ప్రతిభ పోటీలు-2024 జిల్లా స్థాయి పోటీలకు జోగంపేట జెడ్పి ఉన్నత పాఠశాల నుండి 14మంది విద్యార్థులు ఎంపికయ్యారని స్కూలు కోఆర్డినేటర్ ఎం.బాను చందర్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఎంపికైన విద్యార్థులను ఇంచార్జి హెచ్. ఎం కుమారి మరియు ఉపాధ్యాయులు అభినందించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్కూలు స్థాయిలో జరిగిన కౌశల్ వివిధ ప్రతిభ పోటీల్లో విద్యార్థులు రాణించారని,అలాగే జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంపీ శ్రీనివాసరావు, బి అప్పారావు కే బాబురావు ,ఎన్.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.