జగనన్న జన్మదిన వేడుకలు సందర్భంగా ఎంపీపీ మణికుమారి పార్టీ శ్రేణులతో పోస్టరు ఆవిష్కరించారు

 ఈ రోజు గొలుగొండ మండల పరిషత్ ఆఫీస్ వద్ద 21.12.2024వ తేదీన జరిగేపుట్టినరోజు వేడుకులను


జరుపుకొనే మన రాష్ట్ర వైయస్సార్సీపి  అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భముగా మన నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమశంకర్ గణేష్ గారి ఇంటివద్ద పార్టీ ఆఫీస్ లో రక్తదానశిబిరం ఏర్పాటు చేసారు అందుకే ఈరోజు గొలుగొండ మండలపరిషత లో రక్తదానశిబిరం పోస్టర్ ఎంపీపీ గజ్జలపు మణికుమారి గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. మండలములో యువత, పెద్దలు నాయకులు పార్టీ ఆఫీసుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ లు. వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, మండల ప్రధాన కార్యదర్శి కొల్లు సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు చింతల బుల్లి ప్రసాద్, గుండుపాల సర్పంచ్ జోగా రామకృష్ణ, పప్పుశెట్టిపాలెం సర్పంచ్ విజయలక్ష్మి, ఏ ఎల్ పురం  సర్పంచ్ లోచల సుజాత, యాత్ అధ్యక్షులు రామకృష్ణ నాయుడు, విప్పలపాలెం సర్పంచ్ నల్లబెల్లి శ్రీనివాస్, లింగంపేట పరవాడ కవి, లింగంపేట సర్పంచ్ తోకల సంతోషకుమార్,కసిమి సర్పంచ్ శ్రీను, పుత్తడి గైరంపేట    సర్పంచ్ పత్తి రమణ,కోమిరా బాబురావు మొదలగువారు పాల్గొన్నారు.