గొలుగొండ మండలం పాత కృష్ణా దేవి పేటలో కోడి పందాలు పై దాడులు ఇద్దరు వ్యక్తులు అరెస్టు ఎస్ ఐ వై తారకేశ్వరరావు

 


గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాత కృష్ణ దేవి పేటలో కోడిపందాలు ఆడుతున్న వారిపై తమ సిబ్బందితోదాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై వై తార్కేశ్వరరావు తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. తమకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు పాత కృష్ణ దేవి పేట లో గురువారం సాయంత్రం కోడిపందాలు ఆడుతున్న వారిపై దాడి లు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను రెండు కోళ్ళను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 320 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇరువురి పై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు