ఇసుక ట్రాక్టర్ ను ఢీకొని వ్యక్తి మృతి

 ఇసుక ట్రాక్టర్ ను ఢీకొని వ్యక్తి మృతి 

ఇద్దరికీ గాయాలు ఆసుపత్రికి క్షతగాత్రులను తరలింపు 

గొలుగొండ డిసెంబర్ 27 9tvdigital 

ప్లంబింగ్ పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు ఎస్ఐ పి.రామారావు అందించిన వివరాలు ఎలా ఉన్నాయి. పాత కృష్ణ దేవి పేట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ప్లంబింగ్ పని కోసం నర్సీపట్నం వెళ్లి తిరిగి ఇంటికి బైక్ పై వస్తుండగా గొలుగొండ ఎస్సీ కాలనీ వద్ద ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు మృతుడు పెదపూడి రాజేష్ 32 ఇతనికి భార్య ఆరు నెలల కుమారుడు ఉన్నారు. గాయపడిన ఆరుగల్ల్ ప్రకాష్ జిల్లేడుపూడి శివ లను చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు రాజేష్ మృతి దేహాన్ని పోస్టుమార్టం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు