రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్యను ఘనంగా సన్మానించిన ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుర్ల శ్రీను దళిత నాయకులు

 రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారికి ఘన సన్మానం


ఈ రోజు అనగా 29.12.2024 నా కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రం దలితవాడలో ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుర్ల శ్రీను గారు ఆధ్వర్యంలో దళిత నాయకులు ఘనంగా సన్మానించారు ముద్దుగా రౌతుపూడి మార్కెట్ ఎదురుగా ఉన్న బాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరిడయ్య గారు దళిత నాయకులతో కలిసి పూల మాల వేసి నివాళులు అర్పించారు దళిత వాడలో ఉన్న మరో రెండు అంబేద్కర్ విగ్రహాలను పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,ఈ కార్యక్రమానికి, దళిత ప్రగతి ఐక్య సంఘం,దళిత ప్రజా సమితి,నాయకులు పాల్గొన్నారు,దళితప్రగతి ఐక్య సంఘం మండల అధ్యక్షులు బత్తిన అప్పారావు గారు మాట్లాడుతూ మరిడయ్య గారు టీడీపీ లో నిజాయితీగా పని చేసారు అందువల్ల టీడీపీ అధిష్టానం,శాసన సభ స్పీకర్ గారు  మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేసారు

దడాల నాగమణి మాట్లాడుతూ మాల కార్పొరేషన్ ద్వారా మాల అభివృద్ధి చేయాలని కోరారు ,దళిత ప్రజా సమితి నాయకులు ఆపురూప్ మాట్లాడుతూ మరిడ య్యాగారు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అవడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన మన ప్రాంతానికి సుపరిచితులు మనకు అవసరం అయితే అందుబాటులో అన్నారు అందువల్ల మన ప్రాంతంలో ఉన్న దళితుల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం అన్నారు ,దళిత ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొంకిపోది రాజ్యలక్ష్మి,అర్జునరావు,అడ్వకేట్ నిర్మల్,అంతర్జాతీయ మానవహక్కుల రాష్ట్ర ప్రెసిడెంట్ యాదగిరి సూరిబాబు,నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ పోలుపర్తి సాయి,వారి బృందం,అలాగే శంఖవరం,గిడజాం,లచ్చిరెడ్డిపాలెం,బలరాం పురం ,మల్లవరం,గుమ్మరేగుల నుండి అధిక సంఖ్యలో దళితులు(మాలలు)పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యుక్షులు గా యాదకిరి సత్యాప్రకాస్,కార్యనివాహకులుగా కొట్టు అప్పారు,కొట్టు సత్యనారయణ,వ్యవహరించారు రౌతులపూడి మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ లు పాల్గొన్నారు 

సన్మాన గ్రహీత కార్పొరేషన్ డైరెక్టర్ మరిడయ్య మాట్లాడుతూ ముందుగా మన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ పెద్దలు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నేరవేరుస్తాను మాల ఉపకులంలో అర్హులైన ప్రతిఒక్కరిని లబ్దిదారుల చేస్తాను గత ప్రభుత్వం నిలిపివేసిన ఎస్సీల 28 పథకాలను తిరిగి అమల్లో పెట్టిస్తాను మా బోర్డు డైరెక్టర్ ల సమావేశంలో ఈ విషయం లో తీర్మానం చేయించి ముఖ్య మంత్రివర్యులు వరకు తీసుకెళతానని సభాముఖంగా చెప్పారు,భూమి కొనుగోలు,ఆటోలు,కార్లు,దళిత వాడల్లో కమునిటి భవనాలు నిర్మాణానికి కృషి చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించులాగున కృషి చేస్తానని డైరెక్టర్ మరిడయ్య అన్నారు ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గం,నాతవరం మండలం ,గునుపూడిగ్రామ టీడీపీ అధ్యక్షులు పోలుపర్తి సాయి,ఆయన అనుచరులు పాల్గొన్నారు