సామాజిక పింఛన్ల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సమంజనమా.?
జెడ్పీటీసీ సమావేశంలో గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు
సామాజిక పింఛన్ల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంత వరకు సమంజసమని గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు ప్రశ్నించారు. శనివారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ల పంపిణీ విషయంలో గత ప్రభుత్వంలో అధికారులు సిక్స్ పెస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే అర్హులకు మంజూరు చేసేవారని, అటువంటప్పుడు పింఛన్ల మంజూరులో పొరపాటు జరిగిందంటే అది అధికారుల నిర్లక్ష్యం అవుతుంది తప్ప లబ్ధిదారులు తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ఆయన అన్నారు . పింఛన్ల తనిఖీ పేరిట లబ్దిదారులపై కక్ష సాధింపు చర్యలు కాకుండా పొరపాటు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికై ప్రజలకు అన్నిరకాల సేవలు గ్రామస్థాయిలో చేసి, ఆస్తులు కోల్పోయి నిరాదరణకు గురైన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ల కుటుంబాల వారికి పింఛన్లు సదుపాయం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేల కు ఎంపీ లకు గౌరవించినట్లు గానే వీరికి కూడా పదవీకాలం అనంతరం కనీస గౌరవం దక్కేలా ప్రభుత్వాన్ని కోరాలని అడిగారు.ఇంజనీరింగ్ శాఖ అధికారులు జెడ్పీ విధుల ద్వారా చేయించే అభివృద్ధి పనులపై కొంత మేర నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎస్ఆర్జీఎస్, ఇతర నిధుల నుంచి నిర్వహించే పనులతో పాటు వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే మండలాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలను ఆయా జెడ్పీటీసీలకు నివేదిక రూపంలో అందజేయాలని ఆయన కోరారు.🙏