రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య

 తాడేపల్లి,అమరావతి 9tvdigital ఏప్రిల్ 4

రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య 


ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకార జరిగిన అనంతరం డైరెక్టర్ సబ్బవరపు గణేష్ చైర్మన్ మరియు రాష్ట్ర డైరెక్టర్లు అందరినీ సత్కరించారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ వారి ప్రసాదం,మరియు కండువాలు అందరికీ అందించారు అనంతరం చైర్మన్ మరియు డైరెక్టర్లు సచివాలయానికి వెళ్ళి కొంతమంది మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు ,


రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు సాంఘిక శాఖా మాట్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి కార్మిక శాఖా మాత్యులు శ్రీ వాసం శెట్టి సుభాష్ సాంఘిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎమ్.మల్లిఖార్జున నాయక్ గారిని కలవడం జరిగింది ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు లిస్టు నవంబరులో విడుదల అయినా సాంకేతిక కారణాలవల్ల ఉత్తర్వులు ఆలస్యంగా వచ్చాయి ఉత్తర్వులు ఇచ్చిందుకు గాను సంబధిత శాఖ అధికారులకు,మంత్రులకు కృతజ్ఞత లు తెలియజేయడమైనది 

ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు నోటిఫికేషన్ విడుదల అయినది ఎస్సీ నిరుద్యోగులు మరియు ఇతర అర్హత కలిగిన యువత మరియు ఎస్సీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య అన్నారు రాష్ట్ర నలు మూలాల్లో ప్రాంతాల వారీగా అనుకూలమైన యూనిట్లు నిర్వహించుకోవాలని ఇంకా కావల్సిన యూనిట్లు కొరకు ప్రాంతాల వారీగా ఎస్సీ లబ్ధి దారులు ,ఎస్సీ నాయకులు తగిన సూచనలు ఇవ్వాలని డైరెక్టర్ 

మరిడయ్య గారు కొరియున్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాకేంద్ర ప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్ గారు డైరెక్టర్లు 15 మంది, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు