బాబూ జగజ్జీ వన్ రామ్ గారికి ఘన నివాళి అర్పించిన ఏపీ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య
నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గన్నవరం మెట్ట లో 118 వ జయంతి సందర్బంగా బాబూ జగజ్జీవన్ రాం గారి విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు,భారత దేశానికి ఆయన చేసిన సేవను కొనియాడారు,గ్రామీణ పంచాయితీ వ్యవస్థను,రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడంలో జగజ్జేవన్ రాం గారి పాత్ర దేశంలో చాలా ఉంది ,బీహార్ రాష్ట్రంలో జన్మించిన ఆయన ఆరు సార్లు పార్లమెంటు మెంబరగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ,రైల్వే మంత్రిగా,జాతీయ గ్రామీణ శాఖా మంత్రిగా,కార్మిక శాఖా మంత్రిగా పని చేశారు,దళిత జాతిలో పుట్టి ఆణిముత్యం బాబూ జగ జ్జీవన్ రాం ఒకరుగా నిలిచారు
బావి తరాల వారు మహనీయులను మర్చిపోకూడదు .జాతీయనాయకుల చరిత్రలను గుర్తుపెట్టుకొని వారిని స్మరించుకోవాలని దళిత జాతిలో పుట్టి జాతిని కాపాడిన మహా నీయులు దా. బి.ఆర్ అంబేద్కర్,అలాగే బాబూ జగ జ్జేవన్ రాం లాంటి నాయకులను మరువ కూడదు అని యువకులకు ఈ సందర్బంగా తెలియ జేశారు,దళితులు ఐక్యంగా ఉండాలని పంతాలకు పట్టింపులకు పోయి లేనిపోని తగాదాలు తెచ్చుకోవద్దని,మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు